Pakistan Cricket Coach | మాకొద్దు మీ కోచ్ పదవి.. పాక్‌కు షాకిచ్చిన విదేశీ కోచ్‌లు.. ఐపీఎలే ముఖ్యమన్న వాట్సన్
Pakistan Cricket Coach | హెడ్‌కోచ్ కోసం పీసీబీ.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో పాటు విండీస్ దిగ్గజం డారెన్ సామిలను సంప్రదించగా ఆఖరి నిమిషంలో ఈ ఇద్దరూ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Pakistan Cricket Coach | విదేశీ కోచ్‌లను తీసుకొచ్చి పాక్ జట్టు తలరాతను మార్చుదామనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆశలపై ఇద్దరు ఫారెన్ కోచ్‌లు నీళ్లు చల్లారు. తమకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ పదవేమీ అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టులు చాలంటూ తేల్చి చెప్పారు. హెడ్‌కోచ్ కోసం పీసీబీ.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో పాటు విండీస్ దిగ్గజం డారెన్ సామిలను సంప్రదించగా ఆఖరి నిమిషంలో ఈ ఇద్దరూ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సామి తనకు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్ బాధ్యతలు ఉన్నాయని చెప్పగా వాట్సన్ మాత్రం తనకు ఐపీఎల్‌తో పాటు ఇతర లీగ్‌ల కాంట్రాక్టులు ఉన్నాయని పీసీబీకి చెప్పినట్టు పాక్ క్రికెట్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన షేన్ వాట్సన్‌ను పాక్ హెడ్‌కోచ్‌గా నియమించడం ఖాయమేనని గతంలో వార్తలు వచ్చాయి. ఇందుకు గాను వాట్సన్‌తో ఇప్పటికే పీసీబీ సంప్రదింపులు జరిపినట్టు, అతడికి వార్షిక వేతనం కింద భారీగా (2 యూఎస్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 17 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమైందని వినిపించింది. కానీ వాట్సన్ మాత్రం ఫైనాన్షియల్ వ్యవహారాలను చాలా సీక్రెట్‌గా ఉంచాలని కోరినా ఈ విషయాలు సోషల్ మీడియాతో పాటు పాక్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అతడు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.
వాట్సన్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీతో (అసిస్టెంట్ కోచ్) పాటు యూఎస్ఎ లీగ్‌లోనూ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ లీగ్స్‌తో పాటు ఇంటికీ సమయాన్ని కేటాయించాలని అతడు కోరుకుంటున్నాడని అందుకే ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది.
వాట్సన్, సామిలు ఇచ్చిన షాక్‌తో పీసీబీ మళ్లీ హెడ్‌కోచ్‌ల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో పాకిస్తాన్.. స్వదేశంలో న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నాటికి ఆ జట్టు హెడ్‌కోచ్‌ను వెతికిపట్టుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్‌కు విదేశీ కోచ్ ఇప్పటికిప్పుడు కష్టమే గానీ న్యూజిలాండ్ సిరీస్ వరకు లోకల్ కోచ్‌లతో మమ అనిపించి టీ20 వరల్డ్ కప్ నాటికైనా పూర్తిస్థాయి కోచ్‌ను నియమించాలని పీసీబీ భావిస్తోంది. ఈ మేరకు యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్, ఇంజమామ్ ఉల్ హక్, మోయిన్ ఖాన్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

