Dasun Shanaka : ప్రపంచంలోనే పాపులర్ టీ20 లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ కోసం పలువురు క్రికెటర్లు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను వీడుతున్నారు. ఇప్పటికే జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజరబాని (Blessing Muzarabani) పీఎస్ఎల్కు గుడ్ బై చెప్పేసి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్క్వాడ్‌లో చేరగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) సైతం పీఎస్ఎల్ నుంచి వైదొలగనున్నాడు. ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో చెలరేగిన శనకతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఒప్పందం చేసుకోనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ మరో ఆరు రోజుల్లో ప్రారంభమవ్వనుంది. మెగా టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలేన వేళ గాయాలతో వైదొలిగిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. దాంతో, పాకిస్థాన్ సూపర్ లీగ్ వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్టును సైతం వదులుకుంటున్నారు.
Dasun Shanaka is set to join the Rajasthan Royals and has informed the Lahore Qalandars of his decision
Full story: https://t.co/uFmK39JPq7 pic.twitter.com/KGoTm74VFa
— ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2026
తాజాగా దసున్ శనక కూడా ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆల్‌రౌండరైన శనకను కొనేందుకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉంది. గాయపడిన ఆల్‌రౌండర్ సామ్ కరన్ స్థానంలో శనకను తీసుకోవాలని ఫ్రాంచైజీ పావులు కదుపుతోంది. ఇదే విషయంపై ప్రశ్నించగా అవును. మేము శనకతో ఒప్పందం చేసుకోబోతున్నాం. కొన్ని అంశాలు పూర్తి కావాల్సి ఉంది. అతడు శ్రీలంక క్రికెట్‌కు కొన్ని పేపర్లు సమర్పించాల్సి ఉంది అని రాజస్థాన్ రాయల్స్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో వెల్లడించాడు.
నిరుడు అబుధాబీలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో దసున్ శనకను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. కానీ, ఇటీవల ప్రపంచకప్‌లో చెలరేగిన అతడితో పీఎస్ఎల్ ఫ్రాంచైజీ లాహోర్ క్యాలండర్స్ పాక్ కరెన్సీలో రూ.75 లక్షలకు కొన్నది. అయితే.. శనక ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నందున పీఎస్ఎల్ కాంట్రాక్ట్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.