Shakib Al Hasan | బంగ్లా స్పిన్నర్ షకిబుల్ హసన్ సరికొత్త రికార్డు.. టీమిండియాపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు
ఇంగ్లండ్ స్పిన్నర్ అషెలే గిల్స్ 2002లో ఇండియాపై 10-0-57-5 ప్రదర్శన చేశాడు
Shakib Al Hasan : భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. దాంతో, టీమిండియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. షకిబ్ 10 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రెండు మెయిడెన్ ఓవర్లు వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అషెలే గిల్స్ పేరు మీద ఉంది. అతను 2002లో ఇండియాపై 10-0-57-5 ప్రదర్శన చేశాడు. షకిబుల్ హసన్ ప్రస్తుతం టీ20, టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇతను 372 పాయింట్లతో ఐసీసీ ఆల్‌రౌండ్ జాబితాలో ఫస్ట్ ర్యాంకులో ఉన్నాడు.
షకిబుల్ హసన్ చాలా రోజులుగా బంగ్లా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటుతో, బంతితో రాణిస్తూ పెద్ద జట్లపై బంగ్గాదేశ్ను గెలిపించాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లోనూ ఉత్తమ ప్రదర్శన చేశాడు. 59 టెస్టులు ఆడిన షకిబుల్ హసన్ 215 వికెట్లు తీశాడు. వన్డేల్లో 215 వికెట్లు సాధించాడు. మొదటి వన్డేలో షకిబుల్ హసన్ కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఔట్ చేశాడు. పేసర్ హెబడాట్ హొసేన్ నాలుగు వికెట్లు తీయడంతో భారత్ 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 74 రన్స్‌తో ఒంటరిపోరాటం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

