Shaheen Afridi | తొలి ఓవర్లో వికెట్ పడితేనే.. లేకుంటే ఇక అంతే సంగతులు..! పాక్ పేసర్ షాహీన్ రూటే సపరేటు..!
Shaheen Afridi | ‘పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి తొలి స్పెల్‌లో వికెట్ దక్కితేనే.. ఆ తర్వాత అతడు ప్రభావవంతంగా కనిపిస్తాడు. లేకుంటే షాహీన్ అసహనానికి గురై లయ కోల్పోతాడు’ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య ఇది.
Shaheen Afridi | ‘పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి తొలి స్పెల్‌లో వికెట్ దక్కితేనే.. ఆ తర్వాత అతడు ప్రభావవంతంగా కనిపిస్తాడు. లేకుంటే షాహీన్ అసహనానికి గురై లయ కోల్పోతాడు’ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య ఇది. గత కొంత కాలంగా పాక్ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న షాహీన్ వరుస ఇలాగే ఉంది. తొలి స్పెల్‌లో మరీ ముఖ్యంగా తొలి రెండు ఓవర్లలో వికెట్లు పడగొట్టిన సందర్భంలో షాహీన్ చాలా ప్రమాదకారిగా కనిపించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పోరులో షాహీన్ తొలి రెండు ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లో తన్జీద్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షాహీన్.. తన తదుపరి ఓవర్లో నజ్ముల్ హసన్ షాంటోను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో బంగ్లాదేశ్ 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ తర్వాత మిగిలిన బౌలర్లు అదే జోరు కొనసాగిస్తూ.. బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించారు. గతంలో ఈ అంశంపై షాహీన్ షా అఫ్రిదికి పిల్లనిచ్చిన మామ షాహిద్ అఫ్రిది ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదే మా ప్రధాన బలం: రవుఫ్
ఆరంభ ఓవర్లలో షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని.. అతడికి వికెట్లు దక్కిన రోజు తమ బౌలింగ్ యూనిట్ మొత్తం సమిష్టిగా సత్తాచాటుతుందని హరీస్ రవుఫ్ పేర్కొన్నాడు. ‘తొలి స్పెల్‌లో షాహీన్‌కు వికెట్ దక్కితే. మా జట్టుకు శుభారంభం లభించినట్లే. ఇక ఆ తర్వాత అఫ్రిది మరింత ప్రమాదకారిగా కనిపిస్తాడు. గత మ్యాచ్‌లను చూసుకున్నా ఇదే స్పష్టమవుతుంది’ అని తాజా మ్యాచ్ బ్రేక్‌లో రవుఫ్ పేర్కొన్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌లో వరుస పరాజయాల నుంచ కోలుకొని పాకిస్థాన్ బౌలింగ్ యూనిట్ బంగ్లాపై మెరుగైన ప్రదర్శన కనబర్చింది. షాహీన్‌తో పాటు వసీమ్ జూనియర్ చెరో మూడు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 204 పరుగులకే కుప్పకూలింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

