Team India | ప్రపంచకప్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు.. గాయంతో అక్షర్ పటేల్ ఔట్
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
- వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఎంపిక
- రోహిత్‌శర్మ కెప్టెన్సీలో బరిలోకి టీమ్ఇండియా
Team India | న్యూఢిల్లీ: స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బదులుగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేశారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో అశ్విన్‌కు అవకాశం కల్పించారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్ తన అనుభవంతో వికెట్లు పడగొట్టాడు. స్వదేశి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న అశ్విన్ అనుభవం జట్టుకు కీలకమని భావించిన సెలెక్టర్లు అతని వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తున్నది. దీనికి తోడు లోయర్ ఆర్డర్లో ఉపయుక్తమైన బ్యాటింగ్ చేయడం అతనికి కలిసి రానుం ది. శనివారం ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియాతో కలిసి అశ్విన్ గురువారం గువాహటికి చేరుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

