సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
రాయ్‌పూర్: భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (35 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), సచిన్ టెండూల్కర్ (33 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత దిగ్గజాల జట్టు బోణీ కొట్టింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన టీ20 పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బంగ్లా 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో యువరాజ్, ప్రజ్ఞాన్ ఓజా, వినయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మాజీ ఓపెనర్లు రెచ్చిపోవడంతో భారత్ లెజెండ్స్ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరేంద్రుడు సహజసిద్ధ దూకుడుతో చెలరేగి 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదగా.. సచిన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు.
ఫైనల్లో సిమ్రన్‌జిత్
న్యూఢిల్లీ: బోక్సామ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో సిమ్రన్‌జీత్‌కౌర్(60కి) ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో కిరియా తాపియాను సిమ్రన్‌జిత్ చిత్తుచేసింది. మరోవైపు జాస్మిన్(57కి), పూజ రాణి(75కి) ప్రత్యర్థుల విజయాలతో తుది పోరులో నిలిచారు. చాలా రోజుల తర్వాత బౌట్‌లోకి దిగిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ క్వార్టర్స్‌లో వర్జినియా చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడింది. పురుషుల విభాగంలో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- sachin
- sehwag
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

