Satya Nadella: ఇండియన్ జెర్సీలో సత్యా నాదెళ్ల.. ఇండోపాక్ మ్యాచ్ వీక్షించిన మైక్రోసాఫ్ట్ సీఈవో
Satya Nadella: ఇండోపాక్ మ్యాచ్‌ను సత్యా నాదెళ్ల వీక్షించారు. ఇండియన్ జెర్సీ ధరించిన అతను ప్రేక్షకులతో ఎంజాయ్ చేశారు. థ్రిల్లింగ్ సాగిన మ్యాచ్‌లో పాక్‌ను ఇండియా ఓడించిన విషయం తెలిసిందే.
న్యూయార్క్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండోపాక్ మ్యాచ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల(Satya Nadella) ప్రత్యక్షంగా వీక్షించారు. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న సత్యా నాదెళ్ల .. వ్యాపారవేత్త గౌరవ్ జెయిన్‌తో సెల్ఫీ దిగారు. ఇండియన్ జెర్సీ ధరించిన నాదెళ్ల.. మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. క్రికెట్ అభిమానులతో కలిసి సత్యా నాదెళ్ల దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే సత్య నాదెళ్లకు చెందిన ఫోటోకు ఎక్స్ లో లక్షల వ్యూవ్స్ వచ్చాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా అతి కష్టం మీద 119 రన్స్ చేసింది. అయితే 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, పాండ్యా రెండేసి వికెట్లు తీసుకున్నారు. క్రికెట్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల చెప్పాడు. టీమ్ వర్క్, లీడర్షిప్ వంటి వాటిని క్రీడల నుంచే నేర్చుకున్నట్లు తెలిపాడు. క్రికెట్ ఆడడం వల్ల టీమ్‌లతో వర్క్ చేయడం నేర్చుకున్నట్లు గుర్తు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

