హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా ఇటీవల జరిగిన జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిసిన స్విమ్మర్లను సాట్స్ మంగళవారం సన్మానించింది. ఏడు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు ఆరు కాంస్య పతకాలతో మన యువ స్విమ్మర్లు సత్తాచాటారు. టోర్నీలో ఓవరాల్‌గా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతో పాటు మూడు స్వర్ణాలు ఖాతాలో వేసుకుని తనకు తిరుగులేదని చాటిచెప్పింది. సన్మాన కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, స్విమ్మింగ్ కోచ్ సంతోష్, రామకృష్ణ, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.