FIFA : ఫిఫా ప్రపంచకప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నవేళ అమెరికా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరల్డ్కప్ మ్యాచ్లకు వెళ్లకుండా సోమాలియా రిఫరీని దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. మ్యాచ్ అధికారి రిఫరీ ఒమర్ అబ్దుల్కదీర్ అర్తాన్(Omar Abdulkadir Artan)ను వెనక్కి పంపించేశారు. ఫుట్బాల్ పండుగ సమయంలో ఇలా జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిఫా కీలక నిర్ణయం తీసుకుంది.
ఆఫ్రికా దేశమైన సోమాలియాకు చెందిన అబ్దుల్కదీర్ అర్తాన్కు రిఫరీగా మంచి పేరుంది. సాకర్ వరల్డ్కప్ 2026 మ్యాచ్లకు రిఫరీగా అతడు ఎంపికయ్యాడు. దాంతో.. ఆతిథ్య దేశమైన అమెరికాకు వెళ్లిన అర్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. రైటర్స్ మీడియా కథనం ప్రకారం అర్తాన్ జూన్ 6వ తేదీన ఇస్తాంబుల్ మీదుగా మియామి చేరుకున్నాడు. కానీ, అమెరికా సరిహద్దు అధికారులు అతడిని విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. తాను రిఫరీని అని, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణకు తాను వెళ్లాల్సి ఉందని అబ్దుల్కదీర్ ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. విమానాశ్రయం నుంచే అతడిని వెనక్కి పంపించేశారు.
Somali referee Omar Artan will be paid for his World Cup match assignments by FIFA, sources told ESPN, after he was refused entry into the United States prior to the start of the tournament.
Artan, recognized as Africa’s leading referee, returned to Somalia after being turned… pic.twitter.com/iRIpejpjt2
— ESPN FC (@ESPNFC) June 14, 2026
ఈ ఘటనపై వైట్ హౌస్ ఫిఫా టాస్క్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గిలియానీని వివరణ కోరగా.. తాము మంచి కారణంతోనే అర్తాన్ను అనుమతించలేదని చెప్పాడు. తమ రిఫరీని అవమానించడంపై గుర్రుమన్న ఫిఫా అమెరికా అధికారుల తీరును ఖండించింది. అమెరికా అధికారులు తనను దాదాపు 11 గంటలు ప్రశ్నించారని అర్తాన్ తెలిపాడు. అమెరికాకు ఏం పని మీద వచ్చావు? అని అడిగారు. సోమాలియాలో రాజకీయ పరిస్థితులను ఆరా తీశారు. ఉగ్రసంస్థ అల్ షబాబ్ గురించిన ప్రశ్నలు అడిగారు. ఇది దేవుడి నిర్ణయం. నాకు నమ్మకముంది. తర్వాతి మ్యాచ్కు రిఫరీగా వెళ్తాను అని అర్తాన్ వెల్లడించాడు. అయితే.. ఫిఫా మ్యాచ్లకు దూరమైన అర్తాన్కు పూర్తి మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని ఫిఫా పేర్కొంది.
FIFA has confirmed that reigning CAF Referee of the Year Omar Abdulkadir Artan will not officiate at the FIFA World Cup after being denied entry into the United States, despite reportedly holding a valid visa. pic.twitter.com/wLHkdbpPlP
— Ole Teya (@TeyaKevin) June 9, 2026