IND vs WI | శాంసన్ సిక్సర్ల మోత.. మూడో వన్డేలో భారీ స్కోర్ దిశగా భారత్
IND vs WI : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు దంచుతున్నారు. రెండో వన్డేలో విఫలమైన సంజూ శాంసన్(51: 40 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. సిక్సర్ల మోత మోగిస్తున్న అతను రొమరియో షెపర్డ్(Romario Shepherd) ఓవర్లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత బంతికే...
IND vs WI : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు దంచుతున్నారు. రెండో వన్డేలో విఫలమైన సంజూ శాంసన్(51: 40 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. సిక్సర్ల మోత మోగిస్తున్న అతను రొమరియో షెపర్డ్(Romario Shepherd) ఓవర్లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత బంతికే భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. మరోవైపు ఓపెనర్ శుభ్‌మన్ గిల్(76) సాధికారిక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దాంతో, భారత్ 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(Shai Hope) టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండో వన్డేలో మాదిరి వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలనుకున్న అతడి కల నెరవేరలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్(77) హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
Sanju 🔛 song! 👌 👌
This has been a cracking half-century ⚡ ⚡
Follow the match ▶️ https://t.co/boUPUpFuSr#TeamIndia | #WIvIND pic.twitter.com/7xvqyRN5Dq
— BCCI (@BCCI) August 1, 2023
తొలి వికెట్‌కు గిల్- ఇషాన్ కలిసి 143 రన్స్ జోడించారు. ఇషాన్ ఔటయ్యాక వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) విఫలమయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో తేలిపోయిన ఆతిథ్య జట్టు మొదటి వన్డేలో దారుణంగా ఓడిపోయింది. అనూహ్యంగా రెండో వన్డేలో పుంజుకుని సిరీస్ సమం చేసింది. దాంతో, ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
ఇవి కూడా చదవండి
Major League Cricket | సత్య నాదెళ్లపై అంబానీ పైచేయి.. అమెరికా టీ20 లీగ్‌లో ముంబై ఘన విజయం
Moeen Ali | యూటర్న్ ప్రసక్తే లేదు.. స్టోక్స్ మళ్లీ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

