Australia Open | డబుల్స్ నుంచి సానియా జోడీ అవుట్.. ఇక మిక్స్డ్ డబుల్స్పైనే ఆశలు..!
Australia Open | స్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా - అనా డానిలీనా జోడి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లోఇండో-కజఖ్ జోడీ బెల్జియంకు చెందిన అలిసన్ వాన్ యుట్వాంక్, ఉక్రెయిన్‌కు చెందిన అన్హెలినా కాలినినా చేతిలో 4-6, 6-4, 2-6తో
Australia Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా – అనా డానిలీనా జోడి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లోఇండో-కజఖ్ జోడీ బెల్జియంకు చెందిన అలిసన్ వాన్ యుట్వాంక్, ఉక్రెయిన్‌కు చెందిన అన్హెలినా కాలినినా చేతిలో 4-6, 6-4, 2-6తో ఓటమిపాలైంది. దీంతో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఇక మిక్స్డ్ డబుల్స్పైనే ఆశలు పెట్టుకుంది. సానియా జోడీ టైటిల్ నెగ్గడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. సానియా – బోపన్న జోడి శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
రియో 2016 సెమీ-ఫైనలిస్టులు సానియా మీర్జా -రోహన్ బోపన్న 1.14 గంటల్లో 7-5, 6-3 స్కోరుతో ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జామీ ఫోర్లిస్-ల్యూక్ సవిల్లె జోడీని ఓడించింది. ఇదిలా ఉండగా.. సానియా త్వరలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్లోనే ఇది ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఇటీవల విడుదల చేసిన నోట్లో తెలిపింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించిన సానియా.. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

