Oldest Cricketer | క్రికెట్ ఆడిన బామ్మ.. రికార్డులు బద్ధలు కొట్టేసిందిగా..!
Oldest Cricketer : లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) పెద్ద సాహసం చేసింది. ముగ్గురు మనువరాళ్లు కలిగిన ఆమె క్రికెట్లో అరంగేట్రం చేసి అందర్నీ ఔరా అనిపించింది.
Oldest Cricketer : క్రికెట్‌ను ఇష్టపడని వారెవరుంటారు. పసిపిల్లల నుంచి పాతికేళ్ల కుర్రాళ్ల వరకు బ్యాటు పట్టి మురిసిపోతుంటారు. క్రికెట్ సంబురం కుర్రాళ్లు, అమ్మాయిలకేనా? అని అనుకుందేమో. లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) పెద్ద సాహసం చేసింది. ముగ్గురు మనువరాళ్లు కలిగిన ఆమె క్రికెట్లో అరంగేట్రం చేసి అందర్నీ ఔరా అనిపించింది. తద్వారా అతి పెద్ద వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహిళగా బార్టన్ రికార్డు నెలకొల్పింది.
మే నెలలో బార్టన్ గిబ్రాల్టర్(Gibralter) జట్టు తరఫున బార్టన్ ఎస్టోనియా(Estonia)తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడింది. అప్పుడు బార్టన్ వయసు 66 ఏండ్ల 334 రోజులు. పోర్చుగల్‌కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి 2012లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఉద్యోగ విరమణ పొందాక…
ఎస్తోనియాతో పొట్టి సిరీస్‌లో వికెట్ కీపర్ అయిన బార్టన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. అయినప్పటికీ మిగతావాళ్ల విజృంభణతో గిజ్రాల్ట్ జట్టు 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బార్టన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె ఒక మాజీ ప్రొఫెసర్. లండన్ ఎకనామిక్స్ స్కూల్లో(London Economic School) మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందింది. అనంతరం ఇంట్లో బోర్ కొట్టడంతో క్రికెట్ బ్యాట్ పట్టి రికార్డు పుస్తకాల్లో తన పేరు రాసుకుంది.
క్రికెట్ ఆడుతానని ఉహించలే
‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు. కానీ, ఏ ఆటనైనా ఇక ఆపేయాలని చెప్పే చాన్స్ ఎవరికీ ఇవ్వకూడదనుకున్నా. అందుకనే 66 ఏండ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’ అని బార్టన్ ‘బీబీసీ స్పోర్ట్'(BBC Sport)తో చెప్పింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

