Sachin Tendulkar | సచిన్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు
Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) డీప్‌ఫేక్ (deepfake video) బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓ గుర్తు తెలియని వ్యక్తిపై గురువారం కేసు నమోదు చేశారు.
Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) డీప్‌ఫేక్ (deepfake video) బారిన పడిన విషయం తెలిసిందే. ఓ గేమింగ్ యాప్ (online game)ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా సైబర్ నేరగాళ్లు వీడియోను సృష్టించి నెట్టింట వదలడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై సచిన్ కూడా స్పందించారు. ఇది నకిలీదని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సచిన్ కోరారు. తాజాగా ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు.
సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియోకు సంబంధించి ఓ గుర్తు తెలియని వ్యక్తిపై గురువారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 500, ఐటీ చట్టంలోని సెక్షన్ 56 కింద కేసు బుక్ చేశారు.
సచిన్ డీప్‌ఫేక్ వీడియో సోమవారం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. సచిన్ చెప్పినట్టుగా ఉన్న డీప్ ఫేక్ వీడియోలో.. Skyward Aviator Request అనే గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్టుగా ఉంది. తన కూతురు సారా టెండూల్కర్ కూడా ఈ యాప్ వాడుతుందని, దీని ద్వారా వినియోగదారులు వేగంగా డబ్బులు సంపాదిచ్చని సచిన్ చెప్పినట్టుగా సైబర్ నేరగాళ్లు వీడియోను సృష్టించారు.
ఈ వీడియోను స్వయంగా సచిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ… ‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, యాప్స్ గనక మీ దృష్టికి వస్తే అవి సంబంధిత అధికారులకు వెంటనే రిపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల పట్ల సోషల్ మీడియా అప్రపమత్తంగా ఉండాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని కోరాడు.
Also Read..
IndiGo | ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌కు భారీ జరిమానా
Pakistan | ఇరాన్‌పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

