Sachin Tendulkar | అర్ధ సెంచరీలలో అతనే ఫస్ట్.. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరట్లే!
Sachin Tendulkar : భారత క్రికెట్‌కు అతనో చుక్కాని.. క్రికెట్ కోసమే ఈ భూమి మీద అడుగుపెట్టాడా? అనుకునేంతలా ఆటను ఇష్టపడ్డాడు. ముంబై శివాజీ మైదానం(Shivaji Stadium)లో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని.. రెండన్నర దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో ఏలిన మేలిమి క్రికెటర్. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar). తన సుదీర్ఘ కెరీర్లో సచిన్ అసమాన బ్యాటింగ్ నైపుణ్యంతో లెక్కకు మిక్కిలి రికార్డులను తిరుగరాశాడు. వాటిలో అత్యధిక హాఫ్....
Sachin Tendulkar : భారత క్రికెట్‌కు అతనో చుక్కాని.. క్రికెట్ కోసమే ఈ భూమి మీద అడుగుపెట్టాడా? అనుకునేంతలా ఆటను ఇష్టపడ్డాడు. ముంబై శివాజీ మైదానం(Shivaji Stadium)లో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని.. నూనుగు మీసాల వయసులో జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన చిచ్చరపిడుగు అతను. రెండన్నర దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో ఏలిన మేలిమి క్రికెటర్. ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంలా నిలుస్తూ అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన మేరు నగధీరుడు. ఈ ఉపమానాలన్నీ మరెవరికో కాదు మన మాస్టర్ మ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కే. తన సుదీర్ఘ కెరీర్లో సచిన్ అసమాన బ్యాటింగ్ నైపుణ్యంతో లెక్కకు మిక్కిలి రికార్డులను తిరుగరాశాడు. వాటిలో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు ఒకటి.
క్రికెట్ గాడ్‌గా పేరొందిన మాస్టర్ బ్లాస్టర్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచుల్లోకలిపి ఏకంగా 264 సార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు. 1989 నుంచి 2013 వరకు కెరీర్ కొనసాగించిన సచిన్ పాకిస్థాన్(Pakistan)తో ఫైసలాబాద్(Faisalabad)లో జరిగిన తొలి టెస్టులోనే అర్ధసెంచరీ నమోదు చేసుకున్నాడు. అటు పిమ్మట 1992లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టు(Sydney Test)లో తొలి సెంచరీ(148 నాటౌట్) ఖాతాలో వేసుకున్నాడు.
పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి ఫిఫ్టీ కొట్టిన సచిన్

వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు
వన్డేల విషయానికొస్తే.. 1990లో శ్రీలంక(Srilanka)పై సచిన్ స్వదేశంలో 53 పరుగులు, 1994లో ఆస్ట్రేలియాపై 110 పరుగులు చేశాడు. టెస్టుల్లో 119 సార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 145 సార్లు(49 సెంచరీలు, 96 అర్ధసెంచరీలు) ఈ ఫీట్ సాధించాడు.
శ్రీలంకపై తొలి వన్డే హాఫ్ సెంచరీ బాదిన సచిన్

అయితే… కెరీర్లో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన టెండూల్కర్ 10 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 30వేల పరుగులతో పాటు 200 వికెట్లు తీసి తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. అంతేకాదు అత్యధికంగా వంద శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
ఇవి కూడా చదవండి
ICC Men’s Player of the Month | వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టి..ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు తన్నుకుపోయాడు
Ashes Series | యాషెస్ నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్‌కు పిలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

