Sachin Tendulkar | క్రికెట్లో అతడొక జెంటిల్మన్.. యువతకు స్ఫూర్తి..!
Sachin Tendulkar : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ (Kane Williamson)పై సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రశంసలు కురిపించాడు.
Sachin Tendulkar : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ (Kane Williamson)పై సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రశంసలు కురిపించాడు. 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన కేన్ మామ ఆటకు తాను ఫిదా అయ్యానని సచిన్ పేర్కొన్నాడు. సోమవారం ఎక్స్ వేదికగా విలియమ్సన్ క్రికెట్ నైపుణ్యాన్ని, ప్రశాంతమైన అతడి వ్యక్తిత్వాన్ని మాస్టర్ బ్లాస్లర్ కొనియాడాడు.
న్యూజిలాండ్ క్రికెట్లో దిగ్గజంగా పేరొందిన మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నట్టుండి వీడ్కోలుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరో రెండు మూడేళ్లు ఆడగల సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ కబురు వినిపించి మరొకరికి అవకాశమిచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే అల్విదా చెప్పేసిన విలియమ్సన్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు.
High praise for Kane Williamson 🙌 pic.twitter.com/2M2z4nmbVE
— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2026
‘నేను క్రికెట్ ఆడే రోజుల నుంచి చూసిన వాళ్లలో సాంకేతికంగా ఉన్నతమైన అద్భుతమైన బ్యాటర్ విలియమ్సన్. క్రీజులో బ్యాలన్స్, టైమింగ్, అన్నింటికంటే ముఖ్యంగా అతడి ప్రశాంతత వంటివి అతడిని ప్రపంచ క్రికెట్లో నిలకడైన ఆటగాడిగా గుర్తింపునిచ్చాయి. అతడొక జెంటిల్మన్. యువతరానికి అతడు స్ఫూర్తి. అతడు అనూహ్యంగా వీడ్కోలు పలకడం కొంతమంది బౌలర్లకు పెద్ద ఊరట. అతడి తదుపరి ప్రయాణంలో అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నా’ అని సచిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
టెస్టు ఛాంపియన్
ఫ్యాబ్ -4లో తన జోరు చూపించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో పోటీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. 2021లో న్యూజిలాండ్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిపాడు. అంతేనా.. 2019లో బ్లాక్ క్యాప్స్‌ను వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేర్చిన విలియమ్సన్.. అంపైర్ నిర్ణయంతో కప్ చేజారినా కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు.

నిరుడు నవంబర్‌లో అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన కేన్ మామ.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా వైదొలిగాడు. ఐపీఎల్‌లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కేన్ మామ.. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

