న్యూయార్క్: వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సబలెంకా యూఎస్ ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్ వేటలో మరింత ముందంజ వేసింది. మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 6-4, 6-3 తో అమెరికా ప్లేయర్ టౌన్సెండ్ పై వరుస సెట్లలో విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. తొలి రెండు రౌండ్లలో ఐదు సెట్ల సుదీర్ఘ పోరాటాలు చేసిన జ్వెరెవ్ (జర్మనీ)మూడో రౌండ్లో 6-2, 7-6 (7/2), 6-2తో చిలీ ప్లేయర్లో 25వ సీడ్ తబిలోను వరుస సెట్లలో చిత్తు చేశాడు.
కానీ, తొమ్మిదో టేలర్ ఫ్రిట్జ్ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరుండోలో (అర్జెంటీనా) 3-6, 4-6, 6-3, 6-4, 6-4తో ఫ్రిట్జ్‌పై సంచలన విజయం సాధించాడు. ఐదో సీడ్ కోబోలి 7-6 (7/4), 3-6, 0-6, 3-6తో 28వ సీడ్ అలెగ్జాండర్ బ్లాక్స్ చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ రిబకినా (కజకిస్థాన్) 7-6 (8/6), 6-3తో యులియా (ఉక్రెయిన్)ను ఓడించగా..
నాలుగో సీడ్ గాఫ్ (అమెరికా) 6-3, 6-4తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)ను చిత్తు చేసి వరుసగా వరుసగా ఐదో ఏడాది యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) 6-2, 7-6 (7/5)తో నికోలా బార్టుంకోవాను ఓడించగా, పోలాండ్ స్టార్ స్వైటెక్ 7-6 (7/3), 7-6 (7/3) తో 25వ సీడ్ మారియా బౌజ్కోవాపై ఉత్కంఠ విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అమెరికా యంగ్ సెన్సేషన్ ఇవా జోవిచ్ 7-5, 3-6, 7-5తో ఫిలిప్పీన్స్ స్టార్ అలెక్స్ ఇయాలాపై గెలిచింది. 13వ సీడ్ ఒసాకా కూడా ముందంజ వేయగా.. పదో సీడ్ అమాండా అనిసిమోవా 2-6, 5-7తో 24వ సీడ్ అనస్తాసియా పొటపోవా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది.