SA vs AFG: పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తంటాలు పడ్డ సఫారీలు
SA vs AFG: ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్‌కు షాకిచ్చి ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్.. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో తమ సత్తా చాటి సఫారీలను కంగారుపెట్టింది.
SA vs AFG: వన్డే వరల్డ్ కప్‌లో సంచలన విజయాలతో సెమీస్ రేసులో అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ కథ ముగిసింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్‌కు షాకిచ్చి ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్.. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో తమ సత్తా చాటి సఫారీలను కంగారుపెట్టింది. ఓటమితో ప్రయాణాన్ని ముగించినా విజయం కోసం తుదికంటా పోరాడింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు.. 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు ఎప్పటిలాగే ఛేదనలో తడబడినా రస్సీ వాండెర్ డసెన్ (95 బంతుల్లో 76 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్), ఆండిల్ పెహ్లుక్వాయో (37 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు)లు తుదికంటా నిలబడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు.
మోస్తారు లక్ష్య ఛేదనలో సఫారీలకు శుభారంభమే దక్కింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్ (47 బంతుల్లో 41, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), టెంబా బవుమా (28 బంతుల్లో 23, 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 11 ఓవర్లలో 64 పరుగులు జోడించారు. కానీ రెండు పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ నిష్క్రమించారు. వన్ డౌన్లో వచ్చిన డసెన్.. ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 25, 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అయితే రషీద్ ఖాన్ మాయతో మార్క్రమ్తో పాటు హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 10, 1 ఫోర్) పనిపట్టాడు. డేవిడ్ మిల్లర్ (33 బంతుల్లో 24, 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.
182 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మరో రెండు వికెట్లు పడగొడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ డసెన్, పెహ్లుక్వాయో మాత్రం అఫ్గాన్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ధాటిగా ఆడే సఫారీలను అఫ్గాన్ స్పిన్నర్లు కట్టడిచేసినా కీలక సమయంలో వికెట్లు తీయలేక చతికిలపడ్డారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సఫారీలు.. 47.3 ఓవర్లు ఆగాల్సి వచ్చిందంటే అఫ్గాన్ బౌలర్లు వారిని ఎంత కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆఖర్లో 18 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా నవీన్ ఉల్ హక్ వేసిన 48వ ఓవర్లో పెహ్లుక్వాయో.. 6, 4, 6 బాది సఫారీలకు విజయాన్ని అందించాడు.
𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐀𝐭𝐚𝐥𝐚𝐧, 𝐓𝐡𝐞 𝐏𝐫𝐢𝐝𝐞 𝐨𝐟 𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐢𝐬𝐭𝐚𝐧 🤩#AfghanAtalan | #NewCoverPhoto | #CWC23 | #WarzaMaidanGata pic.twitter.com/TmQNrMETUh
— Afghanistan Cricket Board (@ACBofficials) November 10, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

