Ryan Cook : నెదర్లాండ్స్ ప్రధాన కోచ్ పదవికి రియాన్ కుక్(Ryan Cook) రాజీనామా చేశాడు. నాలుగేళ్లుగా డచ్ జట్టుకు సేవలందిస్తున్న రియాన్ ఉన్నపళంగా నేను కోచ్‌గా కొనసాగలేను అని చెప్పేశాడు. ఇటీవలే అతడు రెండోసారి తండ్రయ్యాడు. బిడ్డ పుట్టిన సంతోషంలో అతడు కోచింగ్ పదవిని వదిలేశాడు. భార్యా, పిల్లలతో సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నెదర్లాండ్స్ పురుషుల జట్టు హెడ్‌కోచ్ రియాన్ కుక్ పదవి నుంచి వైదొలిగాడు. 2022 నుంచి డచ్ జట్టును తీర్చిదిద్దిన రియాన్ ఇక సెలవని అందరికీ షాకిచ్చాడు. ‘డచ్ జట్టుకు శిక్షణ ఇవ్వడం నా కోచింగ్ కెరీర్లో ఉన్నతమైనది. పోటీతత్వం కలిగిన జట్టును.. ధ్రుడమైన విలువలతో తీర్చిదిద్దడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని రియాన్ వెల్లడించాడు. అతడి రాజీనామా చేయడంతో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న హీనో కుహ్న్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
𝗧𝗵𝗮𝗻𝗸 𝗬𝗼𝘂, 𝗥𝘆𝗮𝗻 🧡
Ryan Cook has stepped down as Head Coach of the Men’s National Team.
Thank you, Ryan, for your outstanding contribution to Dutch cricket. We wish you, Lindsay and your family all the very best.
Heino Kuhn will serve as Interim Head Coach.#KNCB pic.twitter.com/fQmh2s3jaa
— Cricket🏏Netherlands (@KNCBcricket) June 25, 2026
రియాన్ కుక్ కోచింగ్‌లో నెదర్లాండ్స్ జట్టు సంచలన విజయాలు సాధించింది. అతడు కోచ్‌గా వచ్చిన ఏడాదే డచ్ టీమ్ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 2022 ఎడిషన్‌లో నెదర్లాండ్స్ ఆడింది. ఇక వన్డేల్లోనూ ఆ జట్టు గొప్పగా రాణించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే జట్ల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.