7 బంతుల్లో 7 సిక్సర్లు
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (159 బంతుల్లో 220 నాటౌట్; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘనవిజయం సాధించింది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సోమవారం మహారాష్ట్ర 58 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌ను చిత్తుచేసింది.
- రుతురాజ్ నయా ప్రపంచ రికార్డు
- ఒకే ఓవర్లో 43 రన్స్ రాబట్టిన ఓపెనర్
- ఉత్తరప్రదేశ్‌పై మహారాష్ట్ర గెలుపు
- విజయ్ హజారే ట్రోఫీ
బౌలర్ చేతి నుంచి బంతి రావడమే ఆలస్యం.. ఆకలిగొన్న సింహంలా దానిపై విరుచుకుపడ్డ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఒక ఓవర్లో 7 సిక్సర్లతో లిస్ట్-‘ఏ’ క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్ బౌలర్ శివసింగ్ వేసిన ఓవర్లో 7 సిక్సర్లు కొట్టిన ఈ మరాఠా ప్లేయర్ 43 పరుగులు రాబట్టి చరిత్రకెక్కాడు. రుతురాజ్ ధాటికి భారీ విజయం సాధించిన మహారాష్ట్ర విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
అహ్మదాబాద్: యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (159 బంతుల్లో 220 నాటౌట్; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘనవిజయం సాధించింది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సోమవారం మహారాష్ట్ర 58 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌ను చిత్తుచేసింది. ఇన్నింగ్స్ 49వ ఓవర్లో 7 సిక్సర్లు బాదిన మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ లిస్ట్-‘ఏ’ క్రికెట్లో నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ 47.4 ఓవర్లలో 272 రన్స్‌కు ఆలౌటైంది. ఆర్యన్ (159) పోరాడినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆ ఓవర్ సాగిందిలా..
అప్పటికే శతకం బాది ఫుల్ జోష్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్.. శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫుల్‌టాస్‌గా వచ్చిన తొలి బంతిని లాంగాన్ మీదుగా బౌండ్రీ దాటించిన గైక్వాడ్.. రెండో బంతికి అదే శిక్ష వేశాడు. మూడో బంతిని స్కేర్ లెగ్ మీదుగా సిక్సర్ అరుసుకున్న రుతురాజ్.. నాలుగో బాల్‌ను లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఐదో బంతిని కూడా రుతురాజ్ లాంగాఫ్ మీదుగా సిక్సర్‌గా మలచగా.. అది నో బాల్ కావడంతో.. అదనపు బంతిని లాంగాన్‌లో సిక్స్‌గా మలిచాడు. అప్పటికే ఆరు సిక్సర్లు పూర్తి కాగా.. చివరి బంతికి డీప్ మిడ్‌వికెట్ మీదుగా సూపర్ సిక్సర్‌తో చరిత్రపుటల్లోకెక్కాడు.
పరాగ్ భారీ సెంచరీ
మరో క్వార్టర్ ఫైనల్లో అస్సాం 7 వికెట్ల తేడాతో జమ్ముకశ్మీర్‌పై విజయం సాధించింది. జమ్ము 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. అనంతరం అస్సాం 46.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 354 రన్స్ చేసింది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ (116 బంతుల్లో 174; 12 ఫోర్లు, 12 సిక్సర్లు), రిషవ్ దాస్ (114 నాటౌట్) దంచికొట్టడంతో అస్సాం సునాయాసంగా గెలిచింది.
- లిస్ట్-‘ఏ’ క్రికెట్లో ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కాడు.
- గతంలో లిస్ట్-‘ఏ’ క్రికెట్లో హర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), పెరెరా (శ్రీలంక), జస్కరణ్ మల్హోత్ర (అమెరికా) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు.
- భారత్ తరఫున రంజీ ట్రోఫీలో రవిశాస్త్రి (1985) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్.. ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్‌లో ఉతికి ‘ఆరే’శాడు.
- ఓవరాల్‌గా గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, వైట్లే, హజ్రతుల్లా, కార్టర్, పొలార్డ్, పెరెరా,
జస్కరణ్ మల్హోత్ర ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన జాబితాలో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

