Christiano Ronaldo | ఇన్‌స్టాలో క్రిస్టియానో రొనాల్డో టాప్.. 50 కోట్ల ఫాలోవర్స్‌తో ప్రపంచ రికార్డ్
ప్రొడక్ట్ ప్రచారానికి 2.3 మిలియన్ డాలర్లు తీసుకోనున్న రొనాల్డో
Christiano Ronaldo : సోషల్‌మీడియాలో స్టార్ క్రికెటర్లు, ఫుట్‌బాల్ ఆటగాళ్లను లక్షలాది మంది ఫాలో అవుతుంటారు. అయితే, మిగతావాళ్లతో పోల్చితే పోర్చుగల్ ఫార్వర్డ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు సోషల్‌మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఈ స్టార్ ఆటగాడు అరుదైన ఘనత సాధించాడు. కానీ, మైదానంలో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. ఇన్‌స్టాలో 50 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు. అంటే.. ప్రపంచంలోని 10 శాతం మంది రొనాల్డోను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న వ్యక్తిగా రొనాల్డో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకదేశం తరఫున 110 గోల్స్ చేసిన ఏకైక ఆటగాడి రికార్డు రొనాల్డో పేరు మీదే ఉంది.
నాలుగుసార్లు గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్న రొనాల్డో ఈమధ్యే మంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొనాల్డోను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య 40 కోట్లు ఉండేది. 2021జూన్‌లో రొనాల్డో ఫాలోవర్స్ సంఖ్య 30 కోట్లకు చేరింది. 2020 జనవరిలో 20 కోట్లమంది ఇన్‌స్టాలో రొనాల్డోను అనుసరించేవాళ్లు. ఇన్‌స్టాలో ఏదైనా ప్రొడక్ట్ ప్రచారానికి సంబంధించిన పోస్ట్‌కు రొనాల్డో 2.3 మిలియన్ డాలర్లు తీసుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

