David Beckham | మెస్సీ జెర్సీతో మురిసిపోతున్న రోహిత్ గారాలపట్టీ.. ఇచ్చింది ఎవరంటే..?
David Beckham : భారత పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్( David Beckham) వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అతడు.. వాంఖడే స్టేడియంలో లెజెండరీ క్రికెటర్...
David Beckham : భారత పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్( David Beckham) వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అతడు.. వాంఖడే స్టేడియంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో సందడి చేశాడు. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూతురు సమైరా(Samaira)కి బెక్‌హమ్ స్ఫెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
తమ క్లబ్‌కు ఆడుతున్న స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(Lionel Messi)ని కానుకగా ఇచ్చాడు. చిన్నారి ఆ డ్రెస్ ధరించి తెగ మురిసిపోయింది. ఈ ఫొటోను హిట్‌మ్యాన్ భార్య రితికా సజ్దేహ్(Ritika Sajdeh) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు ..’మెస్సీ చిన్నారి అభిమానిని సంతోషపరిచినందుకు బెక్‌హమ్ నీకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. తమ కూతురికి స్ఫెషల్ గిఫ్ట్ ఇచ్చిన బెక్‌హమ్‌కు హిట్‌మ్యాన్ టీమిండియా జెర్సీని కానుకగా ఇచ్చాడు.
Rohit Sharma’s daughter wearing Messi’s Inter Maimi jersey.
– Rohit 🤝 Messi 🤝 Beckham. pic.twitter.com/IHVt6F5jnc
— Johns. (@CricCrazyJohns) November 17, 2023
ఇంగ్లండ్ గొప్ప ఫుట్‌బాలర్లలో ఒకడైన బెక్‌హమ్ ప్రస్తుతం యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అంతేకాదు అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు సహ యజమానిగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యే ఈ క్లబ్ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi)ని భారీ ధరకు కొనుగోలు చేసింది. మెస్సీ రాకతో ఆ జట్టు మేజర్ సాకర్ లీగ్‌లో వరుస విజయాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఇక.. సెమీస్‌లో కివీస్‌ను చిత్తు చేసిన భారత్ నవంబర్ 19న టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అహ్మదాబాద్ స్టేడియంలో కంగారూలను మట్టికరిపించి 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునే సువర్ణావకాశం రోహిత్ సేనకు వచ్చింది. లీగ్ దశలో ఆసీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా ఫైనల్లోనే అదే ప్రదర్శన చేయాలనే కసితో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

