Rohit Sharma: కొన్నాళ్లైనా టెస్టులు, వన్డేలు ఆడుతా: రోహిత్ శర్మ
Rohit Sharma: ఇంకొన్నాళ్ల పాటు టెస్టులు, వన్డేల్లో ఆడనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇటీవల అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ గెలిచిన నేపథ్యంలో రోహిత్ తన టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
డల్లాస్: ఇంకొన్నాళ్ల పాటు టెస్టులు, వన్డేల్లో ఆడనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తెలిపాడు. ఇటీవల అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ గెలిచిన నేపథ్యంలో రోహిత్ తన టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే టెస్టులు, వన్డేలు ఆడుతాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రోహిత్ ఆ అంశంపై స్పందించారు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్.. ఈ నెల చివరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరంకానున్నాడు. అయితే ఆదివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. మరీ ఎక్కువగా ఆలోచించడం లేదని, కొన్నాళ్లైనా టెస్టులు, వన్డేలు ఆడుతానని పేర్కొన్నాడు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ 159 టీ20 మ్యాచుల్లో 4231 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

