చెపాక్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్, స్కిప్పర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడు బంతులను ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్లో ఇప్పటికే 15 సార్లు డకౌట్ అయిన రోహిత్ శర్మ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్యాటర్లు సునీల్ నరైన్, మన్దీప్ సింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్‌లతో కలిసి సమంగా టాప్‌లో ఉన్నాడు. అయితే, ఇవాళ మరోసారి డకౌట్ కావడంతో ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు.