Miami Open | టాప్ లేపిన బోపన్న జోడీ.. మియామి ఓపెన్ క్వార్టర్స్‌లో స్టార్ ద్వయం
Miami Open : భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) ఈ ఏడాది ఇరగదీస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన బోపన్న ప్రతిష్ఠాత్మక మియామి(Miami Open 2024) ఓపెన్‌లోనూ జోరు చూపిస్తున్నాడు. తొలి రౌండ్ నుంచి రఫ్ఫాడిస్తున్న...
Miami Open : భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) ఈ ఏడాది ఇరగదీస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన బోపన్న ప్రతిష్ఠాత్మక మియామి(Miami Open 2024) ఓపెన్‌లోనూ జోరు చూపిస్తున్నాడు. తొలి రౌండ్ నుంచి రఫ్ఫాడిస్తున్న బోపన్న, మాధ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో హుగో నిస్, జాన్ జీలెన్స్కీ జోడీపై గెలుపొందింది. టాప్ సీడ్ బోపన్న, ఎబ్డెన్ జంట గంట 39 నిమిషాలు సాగిన పోరులో అనూహ్యంగా పుంజుకొని 7-5, 7-6తో విజయం సాధించింది. సెమీస్ బెర్తు కోసం ఈ స్టార్ జోడీ జాన్ పాట్రిక్ స్మిత్(ఆస్ట్రేలియా), సెమ్ వీర్బీక్(నెదర్లాండ్స్) జంటను ఢీకొననుంది.
మాధ్యూ ఎబ్డెన్, బోపన్న

వయసు పెరుగుతున్న కొద్దీ రాటుదేలుతున్న బోపన్న 43 ఏండ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. దాంతో, పురుషుల డబుల్స్‌లో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఇండియన్‌గా బొప్పన్నరికార్డు సృష్టించాడు. గతంలో లియాండర్ పేస్, మహేహ్ భూపతి మాత్రమే డబుల్స్‌లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక మహిళల కేటగిరీలో సానియా మీర్జా డబుల్స్ టైటిల్ గెలిచింది. బొప్పన్న తన సుదీర్ఘ కేరీర్లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. అతను 2017లో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ గెలిచాడు.
ఇవి కూడా చదవండి
- KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ జంప్ : కేటీఆర్
- Cell phone towers | సెల్‌ఫోన్ టవర్ల పరికరాలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్
- Nawazuddin Siddiqui | లైన్ క్లియర్.. మళ్లీ ఒక్కటైన నవాజుద్దీన్-ఆలియా దంపతులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

