పంత్, పాండ్యా అదుర్స్
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. అమెరికాలో తొలిసారి బరిలోకి దిగిన టీమ్ఇండియా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో బంగ్లాపై భారీ విజయం సాధించింది.
- బంగ్లాతో వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. అమెరికాలో తొలిసారి బరిలోకి దిగిన టీమ్ఇండియా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో బంగ్లాపై భారీ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రోహిత్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. రిషబ్ పంత్(53 రిటైర్డ్ ఔట్), హార్దిక్ పాండ్యా(40 నాటౌట్) రాణించారు.
ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్(1) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన పంత్ వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. రోహిత్ (23) జతగా ఇన్నింగ్స్‌కు కొత్త ఊపు తీసుకొచ్చాడు. ఒంటిచేత్తో తనదైన శైలిలో సిక్సర్లు కొడుతూ అలరించాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్(31) మెరుపులు మెరిపించగా, శివమ్‌దూబే(14) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో పాండ్యా దూకుడుగా ఆడటంతో భారత్‌కు పోరాడే స్కోరు దక్కింది. మెహదీహసన్, ఇస్లాం, మహ్మదుల్లా, తన్వీర్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 122/9 స్కోరుకు పరిమితమైంది. అర్ష్‌దీప్(2/12), దూబే(2/13) ధాటికి బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మహ్మదుల్లా(40), షకీబ్అల్హసన్(28) ఆకట్టుకోగా, మిగతావారు పేలవ ప్రదర్శన కనబరిచారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

