కైరో : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ చాంపియన్షిప్లో ఒలింపియన్ ఐశ్వర్య ప్రతాప్సింగ్ తోమర్ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల వ్యక్తిగత 50మీ. రైఫిల్3 పొజిషన్ పోటీలో తోమర్ ఫైనల్లో 16-6 స్కోరుతో ఆస్ట్రియాకు చెందిన అలెగ్జాండర్ ష్మిర్ను ఓడించాడు.
ర్యాంకింగ్ రౌండ్లో తోమర్ 406.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచినా ఫైనల్లో ష్మిర్పై ఆధిక్యం సాధించి స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ చాంపియన్షిప్లో భారత్కు దక్కిన ఆరో పతకమిది. దీనితో భారత్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.