న్యూఢిల్లీ: రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో వెర్స్టాపెన్ గంటా 25 నిమిషాల 33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్.. వరుసగా ఐదో టైటిల్ కైవసం చేసుకున్నాడు. లెక్లెర్క్, పెరెజ్ ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.