IPL 2024 | ఆర్సీబీకి మరో షాక్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్ దూరం
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆట మారలేదు. బ్యాటర్లు భారీ స్కోర్లు అందిస్తున్నా.. వికెట్లు తీసే బౌలర్ కరువయ్యాడు. అసలే ఓటమి బాధలో ఉన్న డూప్లెసిస్ బృందానికి మరో పెద్ద షాక్.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆట మారలేదు. బ్యాటర్లు భారీ స్కోర్లు అందిస్తున్నా.. వికెట్లు తీసే బౌలర్ కరువయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) చేతిలో చావుదెబ్బ తిన్న ఆర్సీబీ వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. అసలే ఓటమి బాధలో ఉన్న డూప్లెసిస్ బృందానికి మరో పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) ఒక మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
ఏప్రిల్ 15న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగే మ్యాచ్‌కు మ్యాక్సీ అందుబాటులో ఉండడం లేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో మ్యాక్స్‌వెల్ కుడి బొటన వేలికి తీవ్రగాయమైంది. నొప్పితో విలవిలలాడిన అతడు వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మ్యాక్సీ ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.
LBW!
Shreyas Gopal with the wicket of Glenn Maxwell, who departs for a duck.
This is Shreyas Gopal’s 50th wicket in #TATAIPL.
Live – https://t.co/7yWt2ui23H #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/3ElL7aY32K
— IndianPremierLeague (@IPL) April 11, 2024
పదిహేడో సీజన్లో ఒక్క భారీ స్కోర్ చేయని మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచాడు. ముంబై ఇండియన్స్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్(Shreyas Gopal) బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దాంతో, అత్యధిక సార్లు సున్నాకే వెనుదిరిగిన మూడో ఆటగాడిగా మ్యాక్సీ రికార్డు కొట్టాడు.

మ్యాక్స్‌వెల్ కంటే ముందు రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌లు 17 సార్లు డకౌటయ్యారు. రషీద్ ఖాన్, పీయూష్ చావ్లా, సునీల్ నరైన్, మన్దీప్ సింగ్‌లు 15 సార్లు డకౌట్ అయ్యారు. మనీశ్ పాండే, అంబటి రాయుడులు 14 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అయితే.. 17వ సీజన్లో మ్యాక్సీ ఆట చూస్తుంటే హిట్‌మ్యాన్, కార్తిక్‌ల రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

