RCB Vs CSK | టాస్ గెలిచిన సీఎస్కే.. తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ
RCB Vs CSK | ఐపీఎల్లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనున్నది.
RCB Vs CSK | ఐపీఎల్లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఎన్గిడిని తుది జట్టులోకి తీసుకుంది.రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనున్నది. ఈ సీజన్లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉన్నది. ప్లేఆఫ్‌కు చేరువైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయం కానున్నది. మరో వైపు సీఎస్కే ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. అయితే, పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న జట్టు గణాంకాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించనున్నది. అదే సమయంలో ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని (కెప్టెన్-వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా.
బెంగళూరు జట్టు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఎన్గిడి, యశ్ దయాల్.
ఆర్సీబీ సబ్స్: సుయాష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, స్వప్నిల్ సింగ్.
చెన్నై సబ్స్: శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

