MI vs RCB : వాంఖడేలో ఆర్సీబీ టాపార్డర్ అర్ధ శతకాలతో హోరెత్తించారు. ముంబై ఇండియన్స్ కంచుకోటలో సిక్సర్ల మోతతో ఫిలిప్ సాల్ట్(78), రజత్ పాటిదార్(53)లు విరుచుకుపడగా.. విరాట్ కోహ్లీ(50) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముగ్గురి ఊచకోతతో 250- 270 కొడుతుంది అనుకున్న ఆర్సీబీని ముంబై బౌలర్లు వరుస వికెట్లతో బ్రేకులు వేశారు. కానీ, డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్(34 నాటౌట్) విధ్వంసంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులతో ముంబైకి సవాల్ విసిరింది.
వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(78), విరాట్ కోహ్లీ(50)లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శాంట్నర్ వేసిన 5వ ఓవర్లో సాల్ట్ తొలి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి.. నాలుగో బంతిని బౌండరీకి తరలించి 22 పరుగులు పిండుకున్నాడు. 8వ ఓవర్లోనూ ఈ ఓపెనర్ హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన సాల్ట్‌ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేసి ముంబైకి ఊరటనిచ్చాడు. 120 వద్ద బెంగళూరు తొలి వికెట్ పడింది.
The #RCB skipper is putting on a show! 🔥
🎥 3️⃣ consecutive sixes for Rajat Patidar right out of the blocks 👊
Updates ▶️ https://t.co/q1MGJfD2d8#TATAIPL | #KhelBindaas | #MIvRCB | @RCBTweets pic.twitter.com/spvz9kZVSr
— IndianPremierLeague (@IPL) April 12, 2026
అనంతరం రజత్ పటిదార్(53 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు).. వస్తూనే సిక్సర్లతో రెచ్చిపోయాడు. సాల్ట్‌ను ఔట్ చేసిన ఆనందాన్ని ముంబైకి దూరం చేస్తూ మయాంక్ మార్కండే ఓవర్లో .. వీరవిహారం చేశాడు పటిదార్. అర్ధ శతకం తర్వాత విరాట్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్(34 నాటౌట్), జితేశ్ శర్మ(10)లు ధనాధన్ ఆడారు.
బుమ్రా ఓవర్లో 4, 6 బాదిన డేవిడ్.. ఆఖరి ఓవర్లో బౌల్ట్ వికెట్ తీసినా చివరి బంతికి సిక్సర్ బాదగా ఆర్సీబీ 240 కొట్టింది. వాంఖడేలో ముంబై అత్యధిక ఛేదన 221 మాత్రమే. దాంతో, ఈసారి పాండ్యా బృందం అద్భతుం చేయాలంటే టాప్ గన్స్ నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడాల్సిందే.
Salty & Fiery a flavour that was just too hot to handle. ♨️🥵
Well played boys! This was beyond entertaining. 🍿 #PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #MIvRCB pic.twitter.com/Q5QyiFsPi0
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 12, 2026