Yash Dayal | ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు.. కారణం ఏంటంటే..?
Yash Dayal | ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘజియాబాద్ ఇందిరాపురం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి సీఎం పోర్టల్‌లో దయాల్‌పై ఫిర్యాదు చేసింది.
Yash Dayal | ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘజియాబాద్ ఇందిరాపురం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి యూపీ సీఎం సీఎం పోర్టల్‌లో దయాల్‌పై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని ఆరోపించింది. సదరు క్రికెటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీఎం పోర్టల్‌లో చేసిన ఫిర్యాదులో ఆ అమ్మాయి తాను ఐదు సంవత్సరాలుగా క్రికెటర్‌తో సంబంధం ఉందని.. తనను పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టాడని.. కాబోయే కోడలంటూ కుటుంబానికి చూపించాడని.. ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది.
కొంతకాలం తర్వాత ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై ప్రశ్నించిన సమయంలో తనను వేధించినట్లుగా పేర్కొంది. ఈ విషయంపై ఈ నెల 14న మహిళా హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశానని.. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించింది. పోలీసులకు ఆధారాలు చూపించానని.. బాధితురాలు వాట్సాప్, స్క్రీన్‌షాట్స్, వీడియోకాల్స్, క్రికెటర్‌తో ఉన్న ఫొటోలను పోలీసులకు ఆధారాలుగా చూపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యష్ దయాల్‌పై కేసు నమోదు చేసినట్లు డీసీపీ నిమిష్ పాటిల్ తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని, వాస్తవాల ఆధారంగా చర్యలుంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

