IPL 2021 | ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హర్షల్ పటేల్
ఐపీఎల్ 2021( IPL 2021 )లో సరికొత్త రికార్డు సృష్టించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్.

దుబాయ్: ఐపీఎల్ 2021( IPL 2021 )లో సరికొత్త రికార్డు సృష్టించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఇండియన్ ప్రిమియర్ లీగ్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా హర్షల్ నిలిచాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీసుకోవడంతో.. ఈ సీజన్లో మొత్తం 11 మ్యాచ్‌లలో అతని వికెట్ల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో అతడు తన ఆర్సీబీ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2015లో చాహల్ ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌గా 23 వికెట్లు తీశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి హర్షల్‌ను తీసుకోవడం ఆర్సీబీకి బాగా కలిసొస్తోంది. రాజస్థాన్‌పై మూడు వికెట్లు తీయడం ద్వారా ఒక సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా హర్షల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కూడా 23 వికెట్లతో చాహల్‌తోపాటు వినయ్‌కుమార్ పేరిట ఉంది. ఈ మధ్యే ముంబైతో మ్యాచ్‌లో హర్షల్ హ్యాట్రిక్ కూడా తీసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఒక సీజన్ ఐపీఎల్లో ఓ బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు 32. 2013లో చెన్నై బౌలర్ డ్వేన్ బ్రేవో ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు హర్షల్ ఆ రికార్డుపై కూడా కన్నేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

