Ravi Sastri on Rishab Pant | రిషబ్‌పంత్‌పై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు.. ఏమైందంటే?!
Ravi Sastri on Rishab Pant | శనివారం ముంబైతో మ్యాచ్ ఓటమికి ఢిల్లీ జట్టు స్వయం కృతమేనని టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Ravi Sastri on Rishab Pant | శనివారం రాత్రి ముంబై ఇండియన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ తీరుపై టీం ఇండియా మాజీ కోచ్ ఘాటు విమర్శలు చేశాడు. టిమ్ డేవిడ్ విషయంలో రివ్యూ అడగక పోవడాన్ని తప్పు బట్టాడు. టిమ్ డేవిడ్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండానే ఔటయ్యే అవకాశం వస్తే ఉపయోగించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా ఐదు ఓవర్లే ఉన్నా.. రెండు సమీక్షలను వాడుకోవాలనే కనీస పరిజ్ఞానం కూడా ఢిల్లీ సారధి రిషబ్ పంత్‌కు తెలియదా? అని మండి పడ్డాడు.
బంతి టిమ్ డేవిడ్ బ్యాట్ అంచును తాకి నేరుగా కీపర్ చేతుల్లో పడినప్పుడు పంత్ వదిలేస్తే మిగతా ప్లేయర్లు ఏం చేశారని నిలదీశాడు. అప్పటికి మ్యాచ్‌లో ఇంకా ఐదు ఓవర్లు, రెండు రివ్యూలు ఉన్నాయని గుర్తు చేశాడు. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసే అవకాశం ఉన్నా.. రివ్యూ కోరలేదు.. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా.. టిమ్ డేవిడ్ ఔటయి ఉంటే ఢిల్లీ గెలుపొందేదన్నాడు. ముంబైతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా చేసుకున్నదేనన్నాడు. అయితే, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని ముంబై సారధి రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

