అమీర్పేట్: ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రవి బిడ్లాన్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. సనత్నగర్ వాల్మీకీ వ్యాయామశాలకు చెందిన రవి బిడ్లాన్ కేరళ వేదికగా జరిగిన పోటీల్లో సత్తాచాటాడు.
105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన రవి.. 12 దేశాలకు చెందిన పవర్ లిఫ్టర్లను మట్టికరిపించి విజయం సాధించాడు.