మెరిసిన అభిరథ్, రాధేశ్
రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో పంజాబ్‌కు భారీ స్కోరు ఇచ్చుకున్న హైదరాబాద్.. బ్యాట్‌తో దీటైన జవాబిస్తోంది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (97), రాహుల్ రాధేశ్ (72 బ్యాటింగ్) సత్తా చాటడంతో మంగళవారం రెండో రోజు ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 193/2 స్కోరుతో నిలిచింది. సీనియర్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (2) ఫెయిలైనా.. అభిరథ్, రాధేశ్ రెండో వికెట్‌కు 154 రన్స్ జోడించి ఆదుకున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో పంజాబ్‌కు భారీ స్కోరు ఇచ్చుకున్న హైదరాబాద్.. బ్యాట్‌తో దీటైన జవాబిస్తోంది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (97), రాహుల్ రాధేశ్ (72 బ్యాటింగ్) సత్తా చాటడంతో మంగళవారం రెండో రోజు ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 193/2 స్కోరుతో నిలిచింది. సీనియర్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (2) ఫెయిలైనా.. అభిరథ్, రాధేశ్ రెండో వికెట్‌కు 154 రన్స్ జోడించి ఆదుకున్నారు.
సెంచరీకి మూడు పరుగుల దూరంలో అభిరథ్ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా.. రాధేశ్ తోడుగా హిమతేజ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ స్కోరుకు ఆతిథ్య జట్టు ఇంకా 238 పరుగుల దూరంలోనే ఉంది. తొలుత 289/6తో ఆట కొనసాగించిన పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 రన్స్‌కు ఆలౌటైంది. సలీల్ అరోరా (151) భారీ శతకంతో మెరిశాడు. ఆతిథ్య బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4, రక్షణ రెడ్డి 3 వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

