Cristiano Ronaldo | క్రిస్టియానో రొనాల్డో డైట్ ప్లాన్ నాసా సైంటిస్టులు డిజైన్ చేశారు : రమీజ్ రాజా
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మాజీ చైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) డైట్ ప్లాన్‌ను నాసా సైంటిస్టులు సిద్ధం చేశారని రమీజ్ రాజా అన్నారు.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మాజీ చైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) డైట్ ప్లాన్‌ను నాసా సైంటిస్టులు సిద్ధం చేశారని రమీజ్ రాజా అన్నారు. మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సునో న్యూస్‌తో రమీజ్ రాజా మాట్లాడుతూ రొనాల్డో డైట్ ప్లాన్ నాసా సైంటిస్టులు రూపొందించారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డో అభిమానులు రమీజ్ రాజాపై మండిపడుతున్నారు. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్‌కు క్వాలిఫై కావడంలో పాక్ విఫలమైనా ఆ దేశ క్రికెట్ నిపుణులు టోర్నమెంట్ అంతటా వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
భారత బౌలర్లకు బాల్ మరింత స్వింగ్ అయ్యేందుకు ఐసీసీ వారికి ప్రత్యేక బాల్స్‌ను సమకూర్చిందని ఆరోపించారు. ఫుట్‌బాల్‌లో గ్లోబల్ ఐకాన్‌గా పేరొందిన క్రిస్టియానా రొనాల్డో అద్భుతమైన ఫిట్నెస్ లెవెల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. శారీరక ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని 36 ఏండ్ల స్టార్ ఫుట్‌బాలర్ నిరూపించారు. క్రీడల్లో విజయానికి శారీరక ధారుఢ్యం అవసరం కావడంతో అందుకు అనుగుణంగా రొనాల్డో ఫిట్నెస్, డైట్ ప్లాన్ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాడు.
కఠిన వర్కవుట్స్, క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలతో రొనాల్డో ఫిట్‌గా మైదానంలో చురకుగా కదలడం సాధ్యమవుతున్నది. రొనాల్డో ఫిట్నెస్ ప్రోటోకాల్‌లో సంప్రదాయ జిమ్ సెషన్‌తో పాటు పైలేట్స్, స్విమ్మింగ్ సహా పలు సెషన్స్ ఉంటాయి. తీవ్ర వ్యాయామంతో పాటు హై ప్రొటీన్ ఆహారం, కూరగాయలు అధికంగా తీసుకోవడంతో పాటు షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిమితంగా తీసుకుంటాడు. అత్యవసర పోషకాలు, తీసుకునే క్యాలరీల మధ్య సమతూకం పాటిస్తాడు. వీటితో పాటు కంటి నిండా కునుకు తీయడం, సరిపడా నీరు తాగడం రొనాల్డో డైట్ ప్లాన్‌లో భాగం.
Read More :
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

