RR vs LSG | టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లే ఆఫ్స్ ఆశలు నిలిచేనా..!
RR vs LSG : అట్టడుగునున్న లక్నో గెలుపుతో పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యశస్వీ జైస్వాల్ బౌలింగ్ తీసుకున్నాడు.
RR vs LSG : ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీ పడుతున్న రాజస్థాన్ రాయల్స్ చావోరేవో పోరుకు సిద్ధమైంది. రెండు పాయింట్లు వస్తేనే ముందుకు వెళ్లేందుకు అవకాశమున్నందున గెలుపే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొడుతోంది. మరోవైపు అట్టడుగునున్న లక్నో గెలుపుతో పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యశస్వీ జైస్వాల్ బౌలింగ్ తీసుకున్నాడు.
లీగ్ దశ ప్రథమార్థంలో వరసగా నాలుగు విజయాలతో జోరు చూపించిన రాజస్థాన్ ఆపై తడబడింది. 12 మ్యాచుల్లో కేవలం ఆరే విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తుకు దూరంగా నిలిచింది. ఈరోజు లక్నోపై గెలిస్తే 14 పాయింట్లతో పంజాబ్‌ను వెనక్కి నెడుతుంది. తర్వాతి పోరులో ముంబైని ఓడిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. అయితే.. గత మ్యాచ్‌లో చెన్నైకి షాకిచ్చిన లక్నో ఈసారి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాలని భావిస్తోంది.
🚨 Toss 🚨@rajasthanroyals have won the toss and elected to bowl first against @LucknowIPL
Yashasvi Jaiswal is leading #RR in the absence of injured Riyan Parag.#TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/kDsCjdWhIO
— IndianPremierLeague (@IPL) May 19, 2026
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్(కెప్టెన్), ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), ఫెరీరా, శుభమ్ దూబే, శనక, ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పంజా.
ఇంప్యాక్ట్ సబ్స్ – వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్, అమన్ రావ్, రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్.
లక్నో తుది జట్టు : మిచెల్ మర్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదొని, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ముకుల్ చౌదరీ, సిద్ధార్థ్, దిగ్వేశ్ రథీ, హిమ్మత్ సింగ్, కులకర్ని.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

