IPL 2023 | ఢిల్లీపై రాజస్థాన్ భారీ విక్టరీ.. వార్నర్ సేనకు హ్యాట్రిక్ ఓటమి
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదడంతో సంజూ సేన భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదడంతో సంజూ సేన భారీ స్కోర్ చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ బౌలింగ్‌తో ఢిల్లీని వణికించాడు. టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది.
భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓవర్లోనే పెద్ద షాక్. ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు ఖాతా తెరవక ముందే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే పృథ్వీ షా(0) ఔటయ్యాడు. మూడో బంతికి మనీశ్ పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. రిలీ రస్సో(14) స్వీప్ షాట్ ఆడబోయి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 36 రన్స్‌కే ఢిల్లీ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. లలిత్ యాదవ్(38), డేవిడ్ వార్నర్(65) ధాటిగా ఆడి స్కోర్ వంద దాటించారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 64 రన్స్ జోడించారు. ఆ తర్వాత పావెల్(2), అక్షర్ పటేల్(2) తొందరగా వెనుదిరిగారు. రాజస్థాన్ ఢిల్లీని 142 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. అశ్విన్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
దంచి కొట్టిన బట్లర్, యశస్వీ
ఐపీఎల్ 16వ సీజన్ 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదారు. ఆఖర్లో హెట్మెయిర్(39) సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. బట్లర్, యశస్వీ తొలి వికెట్‌కు 98 రన్స్ జోడించారు. ప్రమాదకరమైన ఈ జోడీని ముఖేశ్ కుమార్ విడదీశాడు. జైస్వాల్ ఔటయ్యాక పరుగుల వేగం తగ్గింది. సంజూ శాంసన్(0), రియన్ పరాగ్(7) నిరాశ పరిచారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి బట్లర్ ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్ స్కోర్ చేశాడు. హెట్మెయిర్తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. హెయిట్మెయిర్ ఆఖర్లో చెలరేగి ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, రోవ్‌మన్ పావెల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

