SRH vs RR | హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం.. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌కు భారీ ఎదురుదెబ్బ
బ్యాటింగ్‌కు దిగగానే మెయిన్ వికెట్లను హైదరాబాద్ కోల్పోవడంతో కష్టాల్లో పడిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు.
SRH vs RR | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా పూణెలోని స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో గెలిచింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసిన రాజస్థాన్.. హైదరాబాద్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే.. భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది.
Match 5. Rajasthan Royals Won by 61 Run(s) https://t.co/GaOK5ulUqE #SRHvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 29, 2022
బ్యాటింగ్‌కు దిగగానే మెయిన్ వికెట్లను హైదరాబాద్ కోల్పోవడంతో కష్టాల్లో పడిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు. కెప్టెన్, ఓపెనర్ విలియమ్సన్ కేవలం రెండే పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 9 పరుగులే చేశాడు. మార్క్రమ్ కష్టపడి చేసిన హాఫ్ సెంచరీ వృథా అయిపోయింది. హైదరాబాద్‌ను ఆ పరుగులు గెలిపించలేకపోయాయి. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు చేసి స్కోర్ పెంచాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, బౌల్ట్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు.
రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పడిక్కల్ 41, బట్లర్ 35, షిమ్రోన్ 32, పరాగ్ 12 పరుగులు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

