Ind Vs Ban: బంతి పడకుండానే రెండో రోజు ఆట రద్దు..
Kanpur Test: బంగ్లాదేశ్, ఇండియా మధ్య కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దు అయ్యింది. వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు.
కాన్పూర్: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ గ్రౌండ్లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు(Ind Vs Ban) రెండో రోజు ఆట రద్దు అయ్యింది. ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు. ఉదయం నుంచి పలు మార్లు కాన్పూర్‌లో వర్షం పడింది. కవర్స్‌ను మైదానం నుంచి తీయలేదు. ఉదయం చిన్నపాటి జల్లుగా పడిన వాన.. ఆ తర్వాత భారీ వర్షంగా మారింది. దీంతో గ్రౌండ్‌లోని కవర్స్ తీయకుండానే ఉండిపోయాయి. కొంత సమయం వర్షం ఆగినా.. సూపర్ సోపర్లతో ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే మబ్బు పట్టడం వల్ల విజిబులిటీ తగ్గింది. పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. రెండో రోజు ఆటను మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రద్దు చేశారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆదివారం కూడా కాన్పూర్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సోమ, మంగళవారాలు మాత్రం వెచ్చగా ఉండనున్నది. తొలి రోజు 35 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Update from Kanpur 🚨
Play has been called off for Day 2 due to rains.#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HD98D6LK9K
— BCCI (@BCCI) September 28, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

