IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో ఓటముల పరంపరకు చెక్ పెట్టాలనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆశలు ఆవిరయ్యాయి. సొంత ఇలాకా ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్(Punjag Kings)ను ఓడించి గెలుపు బాట పట్టాలనుకున్న కోల్‌కతాకు వరుణుకుడ షాకిచ్చాడు. మూడు గంటలకుపైగా వాన పడడంతో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి. దాంతో, అంపైర్లు చివరకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకొని భారీ స్కోర్ చేయాలనుకుంది. కానీ, రెండో ఓవర్లోనే బార్ట్లెట్ రెండు వికెట్లతో షాకివ్వగా.. కాసేపటికే వరుణుడు నేను సైతం అని కోల్‌కతా ఇన్నింగ్స్‌కు అడ్డుపడ్డాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో (3.4) ఓవర్లోనే ఆటకు అంతరాయం కలిగించిన వర్షం.. మూడు గంటల తర్వాత తెరిపినిచ్చింది. రాత్రి 10:30 తర్వాత వాన తగ్గడంతో సిబ్బంది కవర్లు తొలగించగా.. అంపైర్లు కనీసం ఐదు ఓవర్ల ఆట ఆడించాలని భావించారు. ఆ లెక్కన 11:14 గంటలకు ఐదు ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారని అందరూ అనుకున్నారు.
PBKS remain unbeaten as KKR get their first points of the season 🤝 pic.twitter.com/c6NAYHWEP8
— ESPNcricinfo (@ESPNcricinfo) April 6, 2026
కానీ, ఔట్ ఫీల్డ్ చాలా చోట్ల నీళ్లు ఉండడంతో ఆట సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఇదే విషయాన్ని కెప్టెన్లు అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్‌కు వివరించిన అంపైర్లు ఆట రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఇరుజట్లకు చెరొక పాయింట్ ఇస్తున్నట్టు చెప్పగా అందుకు అంగీకరించిన కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మ్యాచ్ రద్దవ్వడంతో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలనుకున్న పంజాబ్ నిరాశకు లోనవ్వగా. బోణీ చేయాలనుకున్న కోల్‌కతా సైతం ‘ప్చ్’ అని నిట్టూర్చింది.