DC vs RCB : చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జైత్రయాత్ర ముగిసింది. వందో మ్యాచ్‌లో విజయంతో మురవాలనుకున్న ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చెక్ పెట్టింది. 176 పరుగుల ఛేదనలో భువనేశ్వర్(3-26) ధాటికి కష్టాల్లో పడిన ఢిల్లీని ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్), కేఎల్ రాహుల్(57) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. ఆఖరి ఓవర్లో 14 రన్స్ అవసరమవ్వగా.. డేవిడ్ మిల్లర్(22 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్‌తో గెలిపించాడు. ఆరు వికెట్ల తేడాతో గట్టెక్కిన ఢిల్లీ మూడో విజయం నమోదు చేసింది.
పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయంతో మురిసింది. చిన్నస్వామి స్టేడియంలో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 6 వికెట్లతో జయభేరి మోగించింది ఢిల్లీ. కేఎల్ రాహుల్(57), ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్) అర్ధ శతకాలతో మెరవగా.. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ ఈసారి ఏ పొరపాటు చేయకుండా గెలిపించాడు.
A calm innings under pressure! 👌
Tristan Stubbs coming up clutch again with a fifty in the chase! 💪
Will he guide #DC to victory?
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/Vi9FRA2Z5u
— IndianPremierLeague (@IPL) April 18, 2026
తొలుత బెంగళూరును 175కే కట్టడి చేసిన ఆనందం ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిగల్లేదు. తొలి ఓవర్లోనే భువనేశ్వర్(3-26) ఢిల్లీకి ఊహించని ఝలక్ ఇస్తూతొలి ఓవర్లోనే డేంజరస్ పథుమ్ నిశాంక(1)ను వికెటల్ ముందు దొరకబుచ్చుకున్నాడు. తన రెండో ఓవర్లో ఢిల్లీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఇంప్యాక్ట్ సబ్ కరుణ్ నాయర్(5), సమీర్ రిజ్వీ(2)లను ఔట్ చేసిన భువి.. బెంగళూరుకు అవకాశాలు సృష్టించాడు.
ఆరంభంలోనే మూడు వికెట్లు పడిన ఢిల్లీని కేఎల్ రాహుల్(57), ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్) ఆదుకునే పనిలో ఉన్నారు. హేజిల్‌వుడ్ వేసిన ఓవర్లో రెచ్చిపోయిన రాహుల్ 6, 4, 4 తో స్కోర్ 40 దాటించాడు. పవర్ ప్లేలో ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. సుయాశ్ శర్ ఓవర్లో వరస బౌండరీలతో.. ఈ ద్వయం 31 బంతుల్లో 50 రన్స్ జోడించింది. అర్ధ శతకం తర్వాత స్పీడ్ పెంచాలనుకున్న రాహుల్‌ను కృనాల్ పాండ్యా తెలివిగా ఔట్ చేసి ఆర్సీబీని పోటీలోకి తెచ్చాడు.
A brilliant partnership in progress for @DelhiCapitals 👌
Tristan Stubbs 🤝 Captain Axar Patel #DC need 46 runs in 30 deliveries. Who will get the 2️⃣ points? 🤔
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC pic.twitter.com/Q7DSaeOhiW
— IndianPremierLeague (@IPL) April 18, 2026
అనంతరం గెలుపు బాధ్యత తీసుకున్న స్టబ్స్.. సుయాశ్ ఓవర్లో బౌండరీలతో చెలరేగాడు. అయితే.. అక్షర్ పటేల్(26) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగడంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(22 నాటౌట్).. భువి ఓవర్లో సిక్సర్, ఆపై రసిక్ ఓవర్లో బౌండరీలతో సమీకరణం 10 బంతుల్లో 20 పరుగులుగా మారింది. షెపర్డ్ సంధించిన మూడు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన మిల్లర్ ఐదో బంతికి బౌండరీ రాబట్టాడు. అంతే.. సొంతగడ్డపై ఆర్సీబీ చిత్తవ్వగా.. ఢిల్లీ విజయంతో మురిసింది.
A fighting rescue mission filled with spectacular hits 👊
🎥 KL Rahul treated the fans to some majestic sixes during his crucial knock of 57(34)! 💙
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/JA29LlOwDa
— IndianPremierLeague (@IPL) April 18, 2026
సొంత మైదానంలో వందో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంచనా తప్పింది. భారీ స్కోర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను భయపెట్టాలనుకున్న ఆర్సీబీకి ప్రధాన బ్యాటర్లు షాకిచ్చారు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(19) తేలిపోగా.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(63) ఒక్కడే అర్ధ శతకంతో మెరిశాడు.

అక్షర్ పటేల్(2-18), కుల్దీప్ యాదవ్(2-32) తిప్పేయగా.. మిడిలార్డర్ డగౌట్‌కు క్యూ కట్టింది. డెత్ ఓవర్లలో దంచేయాలనుకున్న హిట్టర్లను నట్టూ, ఎంగితి అద్భుతంగా నియంత్రించారు. దాంతో, బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 నష్టానికి 175 పరుగులు చేసిందంతే.