Rahul Dravid | టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!
Rahul Dravid | టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా

న్యూఢిల్లీ : టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేనప్పటికీ, ఆయనతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ షా సమావేశమై ఒప్పించారు. దీంతో టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు ద్రవిడ్ అంగీకరించినట్లు సదరు అధికారి తెలిపారు. 2023 వన్డే ప్రపంచ కప్ వరకు కోచ్‌గా ఉంటానని ద్రవిడ్ చెప్పినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతమున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 14తో ముగియనుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత కివీస్ పర్యటనతో టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ద్రవిడ్ ఉన్నారు. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

