IND vs ENG | ‘బజ్‌బాల్’పై సిరీస్ విజయం.. ద్రావిడ్ ఎమోషనల్.. వీడియో వైరల్
IND vs ENG | విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకున్నా అంతగా అనుభవం లేని ఆటగాళ్లతోనే భారత్.. బజ్‌బాల్‌ను ఓడించింది. నాలుగో టెస్టులో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎమోషన్స్, విజయ సంబురాలకు సంబంధించిన వీడియోను...
IND vs ENG | స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓడినా రోహిత్ సేన రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుంది. వరుసగా వైజాగ్, రాజ్‌కోట్, రాంచీలలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకున్నా అంతగా అనుభవం లేని ఆటగాళ్లతోనే భారత్.. బజ్‌బాల్‌ను ఓడించింది. రాంచీ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎమోషన్స్, విజయ సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది.
వీడియోలో జురెల్.. గెలుపు పరుగు పూర్తిచేయగానే ద్రావిడ్ ‘యెస్.. సాధించాం’ అన్నట్టుగా ఎమోషనల్ అయ్యాడు. వికెట్ తీసినా, సెంచరీ చేసినా, క్యాచ్ పట్టినా కోహ్లీ ముఖంలో కనిపించే అగ్రెసివ్నెస్ ద్రావిడ్‌లో కనిపించింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వం ఉన్న ద్రావిడ్.. ఇలా భావోద్వేగాలను బయటపెట్టడం అరుదు.
No words just pure emotions 🥹
A series win to remember 🔝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/AtyB7tJq4c
— BCCI (@BCCI) February 26, 2024
అప్పుడెప్పుడో ఓ యాప్ కోసం ‘ఇందిరానగర్ గూండా’ అంటూ హంగామా చేసిన ద్రావిడ్.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అసమాన పోరాటంతో మ్యాచ్‌ను గెలిపించాక ద్రావిడ్.. ‘వి డిడ్ ఇట్’ అంటూ హంగామా చేశాడు. తాజాగా ద్రావిడ్.. అదే అటిట్యూడ్‌తో కనిపించాడు. బజ్‌బాల్ ఆటతో విర్రవీగుతున్న జట్టును ఓడించిన ఆనందం ఒకటైతే.. అంతగా అనుభవం లేని జట్టుకు మార్గదర్శకంగా ఉంటూ సిరీస్ నెగ్గడం ద్రావిడ్ ఇలా రియాక్ట్ అవడానికి కారణమై ఉండొచ్చని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు తన దగ్గరకు వచ్చిన శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్‌లను ద్రావిడ్ ఆప్యాయంగా హత్తుకున్నాడు. ‘వెల్డన్ బాయ్స్.. మీ మీద ఉంచిన నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు..’ అన్నట్టుగా వాళ్ల భుజం తట్టాడు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

