Rahul – Athiya wedding | రాహుల్, అథియా వివాహ వేదికపై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి.. ఏం చెప్పాడంటే..?
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఖండాలాలోని తన ఫామ్‌హౌస్‌లో రేపు వీళ్ల వివాహం జరగనుందని చెప్పాడు.
Rahul – Athiya wedding : క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. వీళ్లిద్దరి వివాహం సోమవారం జరగనుందని ఆయన తెలిపాడు. రాహుల్ – అథియా పెళ్లి గురించి అథియా కుటుంబం అధికారిక ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ఖండాలాలోని తన ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఉన్న ఫొటోగ్రాఫర్లతో సునీల్ శెట్టి ఆదివారం మాట్లాడాడు. ‘నా భార్య మనా, కుటుంబసభ్యులతో పాటు కొత్త దంపతులు రాహుల్, అథియాలను రేపు ఉదయం నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్’ అని వాళ్లతో చెప్పాడు. అంతేకాదు వాళ్లకు భోజనం, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఈ బాలీవుడ్ హీరో ఆదేశించాడు. సునీల్ శెట్టి. ఫొటోగ్రాఫర్లతో మాట్లాడిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది.
గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న రాహుల్, అథియా జనవరి 23న పెళ్లితో ఒక్కటవ్వనున్నారు. అయితే.. వీళ్ల వివాహం ఎక్కడ జరగనుందనేది మాత్రం వెల్లడించలేదు. దాంతో అభిమానుల్లో అసక్తి మొదలైంది. ఖండాలాలోని తమ ఫామ్‌హౌస్‌లో రాహుల్, అథియాల పెళ్లి వేడుక జరుగుతుందని స్పష్టం చేశాడు. శ్రీలంకతో రెండో వన్డేలో రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అతను హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

