Rahul – Athiya Wedding | వివాహ బంధంలోకి అడుగు పెట్టిన రాహుల్, అథియా.. పెళ్లి ఫొటోలు వైరల్
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అథియా శెట్టి. ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ రోజు వీళ్ల పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటపెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rahul – Athiya Wedding : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి ఈ రోజుల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నీ వెలుగులో ఎలా ప్రేమించాలో నేను నేర్చుకుంటా. ఈ రోజు మమ్మల్ని ఎంతగానే ఇష్టపడే వాళ్ల సమక్షంలో, మాకు ఎంతో సంతోషం, ప్రశాంతతను పంచిన ఇంటిలో ఈరోజు మా పెళ్లి జరిగింది. గుండెల నిండా కృతజ్ఞత, ప్రేమతో.. జంటగా సాగే మా ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాం’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ కొత్త జంట. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో నవ్వులు చిందిస్తున్న రాహుల్, అథియాకు టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాతో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా శుభాకంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు.
ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కొద్దిమంది సన్నిహితుల సమక్షలంలో రాహుల్, అథియా పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారు. అయితే.. రాహుల్- అథియా తమ రిలేషన్షిప్ విషయం ఎక్కడ బయటపడకుండా చూసుకున్నారు. 2021లో రాహుల్, అథియా పుట్టిన రోజున ఇన్‌స్టాలో ఆమెను విష్ చేస్తూ ఫొటో షేర్ చేశాడు. దాంతో, వాళ్లు ప్రేమలో ఉన్నామనే విషయం అందరికి తెలిసింది. ఆ తర్వాత రాహుల్, అథియా జంటగా పార్టీల్లో కనిపించారు. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

