Rafeal Nadal | స్పెయిన్ బుల్‌కు తొలి పరీక్ష.. మాజీ చాంపియన్‌ను ఓడిస్తాడా..?
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్(Rafeal Nadal) పునరాగమనానికి సిద్దమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్(Brisbane International) టోర్నీతో రఫా మళ్లీ ఫ్యాన్స్ అలరించనున్నాడు. అయితే.. అతడికి యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డోమ్నిక్ థీమ్...
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్(Rafeal Nadal) పునరాగమనానికి సిద్దమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్(Brisbane International) టోర్నీతో రఫా మళ్లీ ఫ్యాన్స్ అలరించనున్నాడు. అయితే.. అతడికి యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డోమ్నిక్ థీమ్(Domni Theim) రూపంలో తొలి పరీక్ష ఎదురవ్వనుంది. తొడకండరాల గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన నాదల్ ఈ టోర్నీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించాడు.
ఫామ్‌లో ఉన్న థీమ్ క్వాలిఫయింగ్ రౌండ్లో విజయం సాధించి బెర్తు దక్కించుకున్నాడు. ఏడాది జనవరి 14న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకాల్లో ఉన్న నాదల్, థీమ్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
‘ప్రస్తుతం నా ఆటతీరు పట్ల సంతోషంగా ఉన్నా. అయితే.. నాపై మునుపటిలా భారీ అంచనాలైతే లేవు. తొలి పోరును విజయంతో ముగించాలని భావిస్తున్నా’ అని నాదల్ అన్నాడు.
నాదల్, థీమ్

నాదల్, థీమ్ ఇప్పటివరకూ 15 సార్లు తలపడ్డారు. అయితే.. రికార్డు స్థాయిలో స్పెయిన్ బుల్ 9 సార్లు గెలుపొందగా.. థీమ్ రెండు సార్లు పై చేయి సాధించాడంతే. అది కూడా కీలకమైన ఏటీపీ ఫైనల్స్, 2022 ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో థీమ్.. రఫాను చిత్తు చేశాడు. దాంతో, ఈసారి ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ముర్రేతో ప్రాక్టీస్ మ్యాచ్
ఒకవేళ నాదల్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. తర్వాతి రౌండ్లో 8వ సీడ్ అస్లాన్ కరట్సేవ్తో తలపడాల్సి ఉంటుంది. సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు సాధించిన నాదల్ పునరాగమంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీ కోసం ఖతార్‌లో శిక్షణ తీసుకున్న 37 ఏండ్ల రఫా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేతో తలపడిన రఫా.. తనైదన షాట్లతో అలరించాడు.
ఇవి కూడా చదవండి
- Tirumala | తిరుమలలో రేపటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
- Vishwak Sen | విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ ఫొటోలు
- Hyderabad | న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ కలకలం.. జూబ్లీహిల్స్‌లో 100 గ్రాముల కొకైన్ స్వాధీనం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

