Rafeal Nadal | మళ్లీ వెంటాడిన గాయం.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నాదల్ ఔట్
Rafeal Nadal : అనుకున్నదొకటి.. అయినదొకటి అనే మాట వినే ఉంటాం. ఈ సామెత మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) కు చక్కగా వర్తించనుంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేసిన రఫా...
Rafeal Nadal : అనుకున్నదొకటి.. అయినదొకటి అనే మాట వినే ఉంటాం. ఈ సామెత మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) కు చక్కగా వర్తించనుంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేసిన రఫా అనూహ్యాంగా ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024) టోర్నీ నుంచి వైదొలిగాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిబ్బేన్ ఇంటర్నేషనల్(brisbane international) టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ బుల్.. తనదైన షాట్లతో అలరించాడు. అయితే.. క్వార్టర్ ఫైనల్లో నాదల్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్ తీయగా చిన్న పగుళ్లు వచ్చినట్టు తెలిసింది. దాంతో, ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని రఫా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘అందరికీ నమస్కారం. గత మ్యాచ్‌లో నా తొడ కండరం భాగంలో చిన్న ఇబ్బంది ఎదురైంది. మెల్బోర్న్లో ఎంఆర్ఐ తీయించుకుంటే చిన్న పగుళ్లు వచ్చినట్టు డాక్టర్లు చెప్పారు. శుభవార్త ఏంటంటే.. గతంలో గాయం అయిన ప్రాంతంలో కాకుండా పక్కన ఈసారి పగుళ్లు వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేను గంటల తరబడి మ్యాచ్ ఆడలేను. అందుకని స్పెయిన్ వెళ్లి నా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి’ అనుకుంటున్నా అని నాదల్ వెల్లడించాడు. దాంతో, కొత్త ఏడాది టైటిళ్ల వేట కొనసాగిస్తాడని ఆశించిన అతడికి నిరాశే మిగిలింది. ‘అయ్యో.. ఏడాది కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది’గా అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 15 నుంచి 28వ తేదీ వరకు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Auckland Classic | అమెరికా టీనేజర్ మరో సంచలనం.. రెండోసారి ఆక్లాండ్ క్లాసిక్ టైటిల్ కొల్లగొట్టిన గాఫ్
- IND vs SA: అందరూ విఫలమైనప్పుడు అయ్యర్‌నే బలిచేయడం ఎందుకు..? శ్రేయస్‌కు మద్దుతగా నిలిచిన సన్నీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

