IPL 2024 CSK vs KKR : స్వల్ప ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై(CSK)కి షాక్. 27 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. వరల్డ్ కప్‌లో దంచికొట్టిన ఓపెనర్ రచిన్ రవీంద్ర(15) మరోసారి నిరాశపరిచాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. వికెట్ పడినా సరే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(32) ధాటిగా ఆడుతున్నాడు. ఇక డారిల్ మిచెల్(3)కు ఒక లైఫ్ లభించింది. 6 ఓవర్లలో సీఎస్కే స్కోర్.. ఇంకా చెన్నై విజయానికి 86 పరుగులు కావాలి.
Opening wicket for #KKR 👌
Vaibhav Arora sends 🔙 Rachin Ravindra 👏#CSK 29/1 after 4 overs
Follow the Match ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @KKRiders pic.twitter.com/1dLQA4FI4P
— IndianPremierLeague (@IPL) April 8, 2024
సొంత స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ తడాఖా చూపించింది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సీఎస్కే బౌలర్లు ముకుతాడు వేశారు. స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తిప్పేయడంతో కోల్‌కతా 137 రన్స్‌కే పరిమితమైంది. ముస్తఫిజుర్, దేశ్‌పాండేలు పేస్‌తో హడలెత్తించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ సునీల్ నరైన్(27), అంగ్క్రిష్ రఘువంశీ(24)లు మాత్రమే రాణించారు. దాంతో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ కొట్టింది.