Ravichandran Ashwin | జట్టులో చోటు గురించి ఆలోచించడం మానేశా.. వరల్డ్ కప్‌లో ఆడడంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) పోటీలకు సమయం దగ్గర పడుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. దాంతో, జట్టులో ఎవరెవరు ఉండాలి? అనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఆ జాబితాలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పేరు మాత్రం వినిపించడం లేదు. బంతితో అద్భుతంగా రాణిస్తున్నా...
Ravichandran Ashwin : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) పోటీలకు సమయం దగ్గర పడుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. దాంతో, జట్టులో ఎవరెవరు ఉండాలి? అనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఆ జాబితాలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పేరు మాత్రం వినిపించడం లేదు. బంతితో అద్భుతంగా రాణిస్తున్నా కూడా ఈ ఆఫ్ స్పిన్నర్ ఎందుకనో ప్రపంచ కప్ రేసులోనూ వెనకబడ్డాడు. తాజాగా అశ్విన్ స్పందించాడు.
‘జట్టులో చోటు గురించి ఆలోచించడం మానేశాని అన్నాడు. నా చేతుల్లో లేని విషయం గురించి బుర్ర బద్ధలు కొట్టుకోవద్దని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నా. ఇప్పటికైతే జీవితం, క్రికెట్ కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నా. అంతేకాదు ప్రతికూల ఆలోచనలను దగ్గరికి రానీయను. ఒకవేళ నేను జట్టులో ఆడకున్నా సరే.. టీమిండియా సొంతగడ్డపై మరోసారి వరల్డ్ కప్ అందుకోవడం చూడాలని ఉంది’ అని అశ్విన్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023)నూ అశ్విన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
అశ్విన్, రోహిత్ శర్మ

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడించకపోవడంతో నిరాశకు గురైన అశ్విన్ వెస్టిండీస్ సిరీస్(west indies tour)లో సత్తా చాటాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో తానొక చాంపియన్ బౌలర్‌ను అని నిరూపించుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే.. వన్డే జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. ఈఏడాది వరల్డ్ కప్‌పై కన్నేసిన భారత జట్టును ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఫిట్నెస్ సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్‌గా చోటు ఖాయం. రెండో స్పిన్నర్ కోసం అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది.
ఇవి కూడా చదవండి
Newzeanland | పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్ వెళ్తున్న న్యూజిలాండ్.. ప్రతీకారం తీర్చుకునేనా..?
Pakistan Cricket Board: ఇమ్రాన్ ఖాన్ విజువల్స్‌తో.. కొత్త వీడియో పోస్టు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

